నేడు తిరుపతిలో పవన్ బహిరంగ సభ!

నేడు తిరుపతి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో  జరిగే ఈ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ వేదిక నుంచే జనసేనాని పవన్ కల్యాణ్  వారాహి డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ కల్యాణ్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ కావడం, అలాగే ఈ సభావేదికగానే ఆయన వారాహి డిక్లరేషన్‌ ప్రకటించనుండడంతో ఈ సభ  విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. వారాహి డిక్లరేషన్ ద్వారా ఆయన ఏం చెప్పబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu