రఘురామ టార్చర్ కేసులో విజయపాల్ కు బెయిల్ నిరాకరణ
posted on Sep 24, 2024 11:50AM
ఉండి ఎమ్మెల్యే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న మాజీ అదనపు ఎస్పి విజయపాల్ కు చుక్కెదురైంది. బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం తిరస్కరించింది. కస్టోడియల్ టార్చర్ కేసులో ఎవన్ గా ఉన్న ఐపిఎస్ అధికారి పిఎస్సార్ ఆంజనేయులు జెత్వాని కేసులో సస్పెండ్ అయ్యారు. ఎ 3గా మాజీ సిఎం జగన్ ఉన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో న్యాయస్థానం బెయిల్ కు నిరాకరించింది
ఎమ్మెల్యే రఘురామ ఇచ్చిన ఫిర్యాదుమేరకు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టోడియల్ టార్చర్ లో రఘురామ తీవ్రగాయాలకు గురైనట్టు సుప్రీం కోర్టు అభిప్రాయన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను ఈ నెల 20 కి హైకోర్టు వాయిదావేసింది.