కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటన.. 9 మందిపై ఎఫ్ఐఆర్
posted on Dec 8, 2015 11:21AM

విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బార్ లైసెన్సీ భాగవతుల శరత్ చంద్ర సహా రాజపురెడ్డి మాలకొండారెడ్డి, టి. వెంకటేశ్వరరావు, కావూరి పూర్ణచంద్ర శర్మ, కావూరి లక్ష్మీ, మల్లాది బాల త్రిపుర సుందరి, కాళిదాసు, వెంకటరమణ, సున్నా వెంకటేశ్వరరావు, మల్లాది విష్ణువుల పై ఎఫైఆర్ నమోదు చేశారు.
ఇదిలా ఉండగా ఏపీ వ్యాప్తంగా పలు బార్లు మూతపడ్డాయి. పలు బ్రాండ్లపై ఏపీ ప్రభుత్వం నిషేదం విధించింది. ఎక్సైజ్ అధికారులు బార్లపై తనిఖీలు నిర్వహించి.. వాటి శాంపిళ్లను తీసుకున్నారు. వాటిని పరీక్షించిన తరువాతే తిరిగి బార్లను ప్రారంభించాలని ఆదేశించారు.