కడుపులో 173 నాణేలు

ఓ వ్యక్తి కడుపులోంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 నాణేలు తీసి అరుదైన శస్త్ర చికిత్స చేశారు కర్ణాటకలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు. వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలో స్థిరపడ్డాడు. అయితే అతనికి మతిస్థిమితం లేని కారణంగా అప్పుడప్పుడు తనకు తెలియకుండా నాణేలు మింగేవాడు. దీంతో అతనికి విపరీతమైన కడుపునొప్పి, మూత్ర విసర్జన సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు అతనిని ఆస్పత్రిలో చేరిపించగా స్కానింగ్ లో అతని కడుపులో నాణేలు ఉన్నట్టు చెప్పారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేసి 173 రూపాయి నాణేలు, ఐదు.. పది రూపాయల నాణేలు బయటకు తీశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu