మాల్యా రాజీనామా తిరస్కరించిన రాజ్యసభ... సంతకం కూడా స్కాన్ చేసిందే..
posted on May 4, 2016 10:30AM

వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనకు ఇక్కడ న్యాయం జరగదనే తను రాజీనామా చేస్తున్నట్టు కూడా మాల్యా లేఖలో పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు మాల్యా రాజీనామా లేఖను అన్సారీ నిన్న తిరస్కరించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఈ లేఖ లేదని, సరైన పద్దతిలో లేని కారణంగానే రాజీనామాను తిరస్కరిస్తున్నామని చెప్పారు. తన రాజీనామా లేఖలో సంతకం కూడా స్కాన్ చేసిఉందని.. ఇది నిబంధనలకు అనుగుమంగా లేదని రాజ్యసభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు రుణ బకాయికి సంబంధించి ఆయన ఇచ్చిన సమాధానంపై కూడా కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మాల్యా ప్రవర్తన రాజ్యసభ ఎంపీ హోదాకు అనుగుణంగా లేదని ఈరోజు రాజ్యసభకు తన నివేదికను సమర్పించనుంది.