కేసీఆర్ పై హరీష్ కుట్ర.. వంటేరు సంచలన ఆరోపణ?

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీలో గందరగోళానికి దారి తీసింది.  ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె సస్పెన్షన్  నేపథ్యంలో  సీనియర్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత స మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన ఆరోపణలను సమర్ధించారు.

ఇప్పుడు కాదు.. 2018లోనే హరీష్ రావు కేసీఆర్ కు వ్యతిరేకంగా కుట్రపన్నారని ఆరోపించారు. అంతే కాదు.. హరీష్ రావు తన సొంత మామ కేసీఆర్ కి వ్యతిరేకంగా కుట్రకు ప్రయత్నించారని ఆరోపించారు.  2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గజ్వేల్ నుంచి పోటీ చేసినప్పుడు హరీష్ రావు తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కేసీఆర్ ను ఓడించడానికి పూర్తి మద్దతు ఇచ్చారని వంటేరు పేర్కొన్నారు.  కేసీఆర్ ఓడిపోతే అంతా మనదే  అని హరీష్ రావు అప్పట్లో  తనకు డబ్బు, మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కవిత  చేసిన ఆరోపణలను వంటేరు సమర్ధించారు.

హరీష్ రావు తనకు ఫోన్ చేసి కేసీఆర్ ఓటమికి సహకరిస్తానని చెప్పారన్న విషయాన్ని తాను ఏ దేవుడిపైనైనా సరే ప్రమాణం చేసి చెబుతానని వంటేరు అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కుట్ర 2018 ఎన్నికలకు ముందే ప్రారంభమైందని వంటే రు చెప్పారు. అప్పట్లో తానీ విషయం చెప్పినా ఎవరూ వినలేదనీ ఆయన అన్నారు.  కవిత సస్పెన్షన్ సమయంలో వంటేరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపడమే కాకుండా అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu