ఆనంది చిత్ర షూటింగ్ పూర్తి
posted on Nov 4, 2013 10:17AM

తెలుగు వారికి అవికా గొర్ అంటే తెలియకపోవచ్చు కానీ, "చిన్నారి పెళ్లి కూతురు" ఆనంది అంటే తెలియని వారుండరు. అంతటి అభిమానం సంపాదించుకున్న ఆనంది అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ అమ్మడు "ఉయ్యాలా జంపాలా" అనే చిత్రం తెరకెక్కుతుంది. డి. సురేష్ బాబు సమర్పణలో సన్ షైన్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని నాగార్జున, రామ్మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ఆడియోని ఈ నెలలోనే విడుదల చేసి, త్వరలోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.