బీ అల‌ర్ట్‌.. 2 రోజుల పాటు భారీ వ‌ర్షాలు..

బంగాళాఖాతంలో గులాబ్ తుఫాన్‌. ఉత్త‌రాంధ్ర‌లో హైఅల‌ర్ట్‌. ఆ సైక్లోన్ ఎఫెక్ట్ తెలంగాణ‌పైనా ఉండ‌నుంది. ఆదివారం రాత్రి నుంచి మంగ‌ళ‌వారం వ‌ర‌కూ.. రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం అల‌ర్ట్ అయింది. ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో పాటు ఉన్న సీఎస్ సోమేశ్‌కుమార్ అక్క‌డి నుంచి ఉన్న‌తాధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌తీ జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. 

ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అల్లర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల‌ని, నాలాలు, చెరువులపై ప్రత్యేక నిఘా పెట్టాల‌ని సీఎస్ ఆదేశించారు. అవసరమైతే ఎన్.డి.ఆర్.ఎఫ్. సేవలను పొందాలని చెప్పారు. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సిబ్బంది, అధికారులు మ‌రింత‌ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తిగా నిండిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలను  పర్యవేక్షిస్తుండాలని సీఎస్ ఆదేశించారు. 

రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమాచారం అందించేందుకు హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సాయం కోసం 040-23202813 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News