వ్యభిచారం కేసులో సీరియల్ నటి అరెస్ట్

 

 

tv actress arrested, sex workers arrested

 

 

సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతులని వ్యభిచారం లోకి దించుతున్న నిర్మాత కార్యాలయం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీస్ మేనేజర్ తో పాటు ఓ బుల్లితెర నటి, మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన రాజు అలియాస్ రాజేష్ నిర్మాతనని చెప్పి శ్రీనగర్‌ కాలనీ సమీపంలోని ప్రగతినగర్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. శ్రీ వెంకటకృష్ణ ఫిలిమ్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. తాము నిర్మించే సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అందమైన అమ్మాయి కావాలని ఏడాది కాలంగా ప్రకటనలిస్తున్నాడు.


ఈ ప్రకటనకు ఆకర్షితులై తన కార్యాలయానికి వచ్చిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నాడు. బుల్లితెర నటి పుష్పాంజలి (22) ఇలాగే అతని ఉచ్చులో పడింది. స్వప్న (24) అనే మరో యువతి కూడా వేషం కోసం వచ్చి వ్యభిచారానికి అలవాటు పడింది. రాజేష్ వ్యవహారంపై సమాచారం అందుకున్న పో లీసులు ఆదివారం అతని కార్యాలయంపై దాడి చేశారు. పుష్పాంజలితో పాటు స్వప్న, విటుడు పవన్‌కుమార్, కార్యాలయం మేనేజర్ లోకేష్ లను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ పరారయ్యాడు. అతను 25 మంది యువతులను వ్యభిచార కూపంలోకి లాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu