కాంగ్రెస్ కు గొట్టిపాటి షాక్, జగన్ పార్టీలోకి

 

congress jagan, jagan ysr congress, gottipati ravi kumar congress, gottipati ravi kumar jagan

 

 

కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ ఈ రోజు జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా గొట్టిపాటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. అయితే కిరణ్ బుజ్జగింపులతో వెనక్కి తగ్గుతూ వచ్చిన అతను ఆఖరికి జగన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.


వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేవారంతా మొదట జగన్ ని చంచల్ గూడ జైలులో కలవడం, ఆ తరువాత విజయమ్మ సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనుండడం జరుగుతున్నాయి.  జగన్ తనకు నియోజకవర్గ టిక్కెట్ ఇచ్చే విషయమై హామీ ఇచ్చారని,  తాను జగన్ వైపు వెళ్తున్నాననే ఉద్దేశ్యంతోనే అధికార కాంగ్రెసు పార్టీ తన క్వారీల పైన దాడులు చేయిస్తోందని గొట్టిపాటి ఆరోపించారు.


జగన్‌ను అన్యాయంగా, కుట్రపూరితంగా అవినీతి కేసులో ఇరికించి జైలులో పెట్టించారని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు.