ఎర్రబెల్లీ...సడన్ గా ఇదేం ట్విస్ట్ !

తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సడన్ ట్విస్ట్ ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్ష పదవి కోసం రేవంత్, ఎర్రబెల్లి హోరాహోరీగా తలపడుతున్నారంటూ ఇప్పటివరకూ వార్తలొస్తే, తానసలు పోటీలోనే లేనంటూ సైడ్ పోయారు ఈ సీనియర్ లీడర్, పైగా చంద్రబాబు నిర్వహించిన ఐవీఆర్ఎస్ పోలింగ్ లో రేవంత్ తర్వాత కొద్దోగొప్పో ఎర్రబెల్లికే ఓట్లు వచ్చాయి, అయినా తాను పోటీలో లేనంటూ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తాను టీటీడీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నందున మరో పదవిపై ఆసక్తి లేదని తేల్చిచెప్పిన ఎర్రబెల్లి....
అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగించినా సహకరిస్తానంటూ తెలిపారు. అయితే పార్టీని సమర్ధంగా నడపగలిగే వ్యక్తికే పగ్గాలు
ఇవ్వాలన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu