తిరుమలకు రాకపోకలు నిలిపివేత

కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు మూసివేత
భక్తులంతా కిందకు వచ్చిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు మూసివేత
సాయంత్రం నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం బంద్

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపైకి భక్తులు వెళ్లే ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. టీటీడీ అధికారుల ఆదేశాలతో పైకి వెళ్లే ఘాట్ రోడ్డు మూతపడింది. వాహనాలు కొండపైకి వెళ్లకుండా విజిలెన్స్ అధికారులు ఆపేస్తున్నారు.  భక్తులు కొండపై నుంచి కిందకు వచ్చే ఘాట్ రోడ్డును మాత్రం తెరిచి ఉంచారు. నేటి సాయంత్రం నుంచి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కూడా నిలిపివేయనున్నారు. కొండపై నుంచి భక్తులంగా కిందకు దిగి వచ్చాక... రెండో ఘాట్ ను కూడా అధికారులు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో, సాయంత్రానికల్లా తిరుమల నిర్మానుష్యంగా మారనుంది. అయితే స్వామివారికి నిర్వహించే సేవలను మాత్రం అర్చకుల యథావిధిగా నిర్వహిస్తారు.