శారదాపీఠానికి టీటీడీ నోటీసులు
posted on Apr 21, 2025 10:00AM

తిరుమలలోని శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. గోగర్భం తీర్థం వద్ద శారదాపీఠం భవనాన్ని 15 రోజులలోగా ఖాళీ చేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శారదాపీఠం అక్రమంగా నిర్మాణాలను చేపట్టింది. దీనిపై అప్పట్లోనే హైందవ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూమిలో కాలువను ఆక్రమించి 20 వేల చదరపుటడుగుల మేర శారదా పీఠం అక్రమ నిర్మాణాలను చేపట్టింది.
దీనిపై హైందవ సంఘాలు కోర్టును ఇశ్రయించడంతో కోర్టు తీర్పు హైందవ సంఘాలకు అనుకూలంగా వచ్చింది. అప్పటికే వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో హైందవ సంఘాలు శారద పీఠం అక్రమ నిర్మాణాల విషయాన్ని టీటీడీ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన తొలి పాలకమండలి సమావేశంలోనే చర్చించి, ఆ భవనాలను తొలగించాలని నిర్ణయించింది.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని శారదా పీఠం కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది దీనిపై శారదా పీఘం హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. . తాజాగా టీటీడీ ఇచ్చిన షోకాజ్ నోటీసులులో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటూ కోర్టు స్టే ఎత్తివేసింది. టీటీడీ ఎస్టేట్ విభాగం విశాఖ శారదా పీఠం భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది.