టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్
posted on Jul 19, 2025 12:45PM
.webp)
టీటీడీ దేవస్థానంలో పని చేస్తున్ననలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి, స్టాప్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ , బర్డ్ ఆసుపత్రి, అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ లలో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేసింది. సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగింది .ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.