పొంగులేటి వర్గానికి తెలంగాణ సర్కార్ షాక్.. ముగ్గురు నేతలకు భద్రత కుదింపు

 పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.  ఇప్పటికే మాజీ ఎంపీకి గన్ మెన్లను తగ్గించిన కేసీఆర్ సర్కార్ తజాగా ఆయన వర్గానికి చెందిన  మరో ముగ్గురు నేతలకు భద్రత కుదించింది. జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య కు గన్ మెన్ల సంఖ్యను . 2 ప్లస్ 2 నుంచి 1ప్లస్ 1కు కుదించింది.

దీంతో ఆయన  తనకు గన్ మన్  అవసరం లేదని ఉన్నవారిని  వెనక్కి పంపారు. అదే విధంగా పినపాక మాజీ ఎమ్మెల్యే   పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ ఛార్జి వెంకట్రావుకు కూడా  గన్ మన్ లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

దీనిపై  పాయం తనకు కేటాయించిన గన్ మెన్స్ ను తొలగించడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. సెక్యూరిటీ తీసేసినంత మాత్రాన పోయేది ఏమీ లేదన్నారు. ఇక వెంకట్రావు స్పందిస్తూ సర్కారు నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా తన ప్రయాణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోనే అని స్పష్టం చేశారు. సెక్యూరిటీ తొలగింపు నిస్సందేహంగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని విమర్శించారు.