సిట్ విచారణకు బండి డుమ్మా!
posted on Mar 24, 2023 3:29PM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లేకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టారు. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కీలకమైన బిల్లులపై చర్చ జరుగుతున్నందున సభ్యులంతా హాజరుకావాల్సిందిగా పార్టీ అగ్రనాయకత్వం విప్ జారీ చేయడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కార్యాలయం, పేషీపైన బండి సంజయ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘సిట్’పై నమ్మకం లేదని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గతంలో డిమాండ్ చేశారు.
ఇదే వ్యవహారంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీచేయగా ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. అయితే బండి సంజయ్ మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు. . సిట్ దర్యాప్తు ఎక్కడివరకు వచ్చిందో లేటెస్ట్ స్టేటస్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా సిట్ చీఫ్‌కు గవర్నర్ లేఖ రాశారు.