కేసీఆర్ కు ఊహించని షాక్.. బీజేపీలోకి టీఆర్ఎస్ నేతలు!!

 

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి పార్టీ ఉందా లేదా అన్నట్టుగా తయారైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే 12 మంది టీఆర్ఎస్ గూటికి వెళ్లారు. మరికొందరు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావటం, తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలవటంతో బీజేపీలో ఎక్కడ లేని ఉత్సహం వచ్చింది. ఇదే ఊపులో కాంగ్రెస్ కి చెక్ పెట్టి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదగటానికి పావులు కదుపుతుంది. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను మాత్రమే కాకుండా, టీఆర్ఎస్ కు చెందిన నేతలను కూడా చేర్చుకోవటానికి బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల బీజేపీ నేత రామ్ మాధవ్ పార్క్ హయత్ హోటల్ లో పలువురు నేతలను కలిశారు. వారిలో కాంగ్రెస్ కి చెందిన వాళ్ళు మాత్రమే కాకుండా, టీఆర్ఎస్ కి చెందిన నేతలు సైతం ఉన్నారట. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ మాతో చాలా మంది టచ్ లో ఉన్నారు, వాళ్లలో టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారని చెపుతూ బాంబు పేల్చారు. దీంతో బీజేపీతో టచ్ లో ఉన్న నేతలు ఎవరా అని టీఆర్ఎస్ అధిష్టానంలో అందోళన మొదలైందట. దీనిపై కేటీఆర్ కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిజంగానే నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నారా? లేక బీజేపీ మైండ్ గేమ్ ఏమైనా ఆడుతుందా అని ఆలోచనలో పడ్డారట. మరి ఇది బీజేపీ మైండ్ గేమా? లేక నిజంగానే నేతలను చేర్చుకొని టీఆర్ఎస్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో.