ఇక TRS కాదు BRS.. కేసీఆర్ జాతీయ‌ పార్టీ!

అనుకున్న‌ట్టే అయింది. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌స్తావ‌న చేశారు. అయితే, నేరుగా ఆ విష‌యం చెప్ప‌కుండా ప‌రోక్షంగా కాస్త క్లారిటీ ఇచ్చారు. భ‌విష్య‌త్తులో TRS పార్టీ BRS అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్టు ఇండికేష‌న్ ఇచ్చారు. 

పార్టీ ప్లీన‌రీలో సుదీర్ఘంగా మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. వ్యూహాత్మ‌కంగా BRS ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. కారు పార్టీ ఎమ్మెల్యే గాద‌రి కిశోర్ ఓ న్యూస్ పేప‌ర్లో రాసిన వ్యాసాన్ని కోట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి-TRS ను.. భార‌తీయ రాష్ట్ర స‌మితి-BRS గా చేయాల‌ని ఆ ఆర్టిక‌ల్‌లో ఎమ్మెల్యే కిశోర్ ప్ర‌తిపాదించార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి అనేక ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తున్నాయంటూ.. కావాల‌నే BRS పేరును కేసీఆర్ బ‌హిరంగ వేదిక‌గా ప్ర‌స్తావించి చ‌ర్చ‌కు తెర తీశారు. 

కేసీఆర్ మ‌దిలో కొత్త జాతీయ పార్టీ తీసుకురావాల‌నే ఆలోచ‌న ఉంది కాబ‌ట్టే.. పార్టీ పేరు భార‌తీయ రాష్ట్ర స‌మితి-BRS గా ఉండే అవ‌కాశం ఉంద‌నేలా.. ముంద‌స్తు లీకులు ఇచ్చార‌ని అంటున్నారు. లేదంటే, ఓ ఎమ్మెల్యే ఏదో పేప‌ర్లో చేసిన‌ BRS ప్ర‌తిపాద‌న‌ను కేసీఆర్.. ప్లీన‌రీలో ప్ర‌స్తావించే వారు కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంటే.. త్వ‌ర‌లోనే కొత్త జాతీయ పార్టీ పెట్ట‌డం ఖాయ‌మ‌ని.. ఆ పార్టీ పేరు భార‌తీయ రాష్ట్ర స‌మితి-BRS గా ఉంటుంద‌నే చ‌ర్చ మొద‌లైపోయింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu