ఆడపిల్ల పుట్టిందని..భార్యకు "తలాక్‌"

వాట్సాప్, మెసేజ్, న్యూస్ పేపర్స్ ద్వారా ఇటీవలి కాలంలో ట్రిపుల్ తలాక్ చెబుతూ దాంపత్య బంధానికి వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా ఆడపిల్లలకు జన్మనిచ్చారనే కారణంతో ఇద్దరు మహిళలకు వారి భర్తలు తలాక్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ అమ్రోహా ప్రాంతానికి చెందిన షుమైలా జావెద్ ఇటీవలే ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త..ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులిచ్చాడు. దీంతో తనకు న్యాయం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మీడియా ద్వారా కోరింది..అన్నట్లు ఆమె జాతీయ స్థాయి నెట్‌బాల్ క్రీడాకారిణి...ఈ క్రీడలో ఎన్నో అవార్డులు కూడా సాధించారు. కాగా..ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుండగానే అదే ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. అఫ్రీన్ అనే మహిళకు కవల ఆడపిల్లలు పుట్టారు. దీంతో ఆమె భర్త ఫేస్‌బుక్‌ ద్వారా ట్రిపుల్ తలాక్ చెపుతూ పోస్ట్ చేశాడు..అనంతరం అఫ్రీన్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu