ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి
posted on Jul 30, 2024 9:45AM
ఝార్ఖండ్ ల మంగళవారం (జులై 30) తెల్లవారు జామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఝార్ఖండ్ లోకి చక్రధరూర్ డివిజన్ లో హౌరా-ముంబై రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జంషడ్పూర్ కు 80 కిలోమీటర్ల దూరంలోని చ క్రధర్పూర్ వద్ద ఈ తెల్లవారు జామున గూడ్స్ రైలు పట్టాలు తప్పి దాని బోగీలు పక్క ట్రాక్ పై పడ్డాయి. అదే సమయంలో ఆ లైన్లో వచ్చిన హౌరా ముంబై రైలు ఆ బోగీలను ఢీకొంది.
ఈ ఘటనలో హౌరా-ముంబై రైలుకు చెందిన 18 బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.