తిరుపతి ఎమ్మెల్యేకి గుండెపోటు కాదు.. కేవలం అస్వస్థత...
posted on Nov 16, 2014 9:41AM

తిరుపతి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వెంకట రమణకు గుండెపోటు వచ్చిన కారణంగా ఆయనను కుటుంబ సభ్యులు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం స్విమ్స్ ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా వుంది. స్విమ్స్ వైద్యులు వెంకట రమణ ఆరోగ్య పరిస్థితి మీద స్పష్టత ఇచ్చారు. వెంకటరమణకు గుండెపోటు రాలేదని, మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకోవలసి వుంటుందని, అయితే ఆయన కొంతకాలంగా డయాలసిస్ చేయించుకోని కారణంగా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఆయనకు డయాలసిస్ చేశామని, ఆయన ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని వివరించారు.