దోపిడీ కేసులో తిరుమలలో పని చేసే కానిస్టుబుల్ ను అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు
posted on Jun 19, 2025 5:54PM
.webp)
తిరుమలలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అరుణ్ కుమార్ ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యాపార వేత్త నివాసంలో ఆయన భార్యపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన కేసులో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని వాణియంబాడిలో తోళ్లపరిశ్రమ యజమాని ఇంతియాస్ అహ్మద్ ఇంట్లో మూడు రోజుల కిందట దోపిడీ జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా వాణియంబాడి పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చెన్నైకు చెందిన దోపిడీ ముఠా సభ్యులకు, ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో పని చేసే శక్తివేల్‌కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
శక్తివేల్‌తో పాటు తిరుపతికి చెందిన శాంతకుమారి, కొల్లకట్టై ప్రాంతానికి చెందిన ఇళవరసన్( ) సహా నలుగురికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌కు.. ఇళవరసన్‌కు పరిచయం ఉండగా.. ఇళవరసన్‌క తిరుపతికి చెందిన శాంతకుమారి తెలుసు. ఈ ముగ్గురు కలిసి తిరుమలలో పనిచేసే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సాయంతో అరుణ్ కుమార్ అపథకం ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. ఆ కేసులోనే కానిస్టేబుల్ అరుణ్ కుమార్‌ను తిరుపతి పోలీసుల సహకారంతో తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి వాణియంబాడికి తరలించారు.