వారి మృతికి జగన్ దే బాధ్యత.. కన్నా

వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని  తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మరణించారనీ, వారిలో ఒకరు జగన్ కాన్వాయ్ లో వాహనం ఢీ కొని మరణిస్తే.. మరొకరు ఎండలో ర్యాలీ కారణంగా మరణించారనీ ఆయన తెలిపారు. ఆ ఇద్దరి మృతికీ జగనే బాధ్యత వహించాలనన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కన్నా..  జగన్ హయాంలో తాము ర్యాలీలకు పిలుపునిస్తే  తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు.

అప్పటి రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటలను కూడా అడ్డుకున్నారన్నారు. మూడు వాహనాలు, వంద మందితో వెళ్లాలని పోలీసులు చెప్పినా.. భారీగా వెళ్లి అరాచకం సృష్టించారని ఆరోపించారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా పక్కకు నెట్టేశారని కన్నా ఆరోపించారు. 

ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శిస్తారు కానీ ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పలకరించే  కూడా జగన్ కు లేదా అని నిలదీశారు. జగన్ అబద్ధపు మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్న కన్నా ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా జనం పట్టించుకోరన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu