గిరిజనుడిపై పెద్దపులి దాడి

నల్లమల అడవి ప్రాంతంలోని అభయారణ్యంలో పెద్దపులి దాడిలో ఓ  గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆత్మకూరు రేంజ్ లో  కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గుడానికి చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడిపై సోమవారం ( జులై 21) పులి దాడి  చేసింది. అదృష్టవశాత్తూ పులి దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన అంకన్నను ఆత్మకూరు  ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు. ఆత్మకూర్ రేంజ్ పరిధిలోని చదరం పెంట చెంచుగూడెం లో పులిచెర్ల అంకన్న తన పొలంలో సాగుచేసిన వరి పంటను చూసుకునేందుకు పొలం వైపు వెడుతుండగా.. పొదల్లో మాటేసి ఉన్న  పెద్దపులి ఒక్కసారిగా  దాడి చేసింది.

ఎలాగో పెద్దపులి దాడి నుంచి అంకన్న తప్పించుకున్నప్పటికీ కాళ్లకూ, చేతులకూ తీవ్ర గాయాలయ్యాయి.  ఈ సంఘటనతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. అంకన్న కేకలు విని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడం.. వారి అరుపులకు బెదరిని పులి అంకన్నను వదిలేసి పోయింది. అయితే మనిషిరక్తం రుచి చూసిన పులి మానీటర్ గా మారుతుందన్న ఆందోళన గిరిజనులతో వ్యక్తం అవుతోంది.  అటవీ అధికారులు పులులు గ్రామాలలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu