వర్షాలే.. వర్షాలు.. ఇక ఇప్పుడు ఏపీ వంతు
posted on Jul 22, 2025 10:34AM
.webp)
గత నాలుగు రోజులుగా తెలంగాణలో దంచి కొట్టిన వర్షాలు మంగళవారం నాడు ఒకింత తెరిపి ఇచ్చాయి. ఇక ఇప్పుడు ఏపీ వంతు అంటున్నాయి. రానున్నమూడు రోజులూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది.
విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా అల్లురి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందనీ, మిగిలిన జిల్లాలలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.