సైకిల్ యాత్రికుడి భారతదేశ యాత్ర గుంటూరు ప్రవేశం

పర్యావరణ సమతుల్యతపై ప్రజలలో అవగాహన కల్లించడమే ధ్యేయంగా ఓ యువకుడు చేపట్టిన సైకిల్ యాత్ర గుంటూరు చేరుకుంది. డిగ్రీ విద్యార్థి కోటా కార్తిక్ ఈ  బృహత్ కర్యక్రమాన్ని చేపట్టాడు. చిన్ననాటి నుంచే భూమిపై పచ్చదనాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మొక్కలు నాటుతూ, పర్యావరణ కాలుష్యాన్నితగ్గించే లక్ష్యంతో ముందుకు సాగిన కోటా కార్తిక్  ఇప్పుడు అదే లక్ష్యంతో కడప టు కాశ్మీర్ అంటూ సైకిల్ పై భారతదేశ యాత్ర ప్రారంభించాడు. సేవ్ ఎర్త్.. సేవ్ ట్రీస్ అనే నినాదంతో ఈ యాత్ర చేపట్టాడు. తన యాత్ర పొడవునా దారిలో మొక్కలు నాటుతూ.. వాతావరణ కాలుష్యాన్ని రహిత భారత దేశ నిర్మాణంపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్న కోటా కార్తీయ్ యాత్ర గుంటూరు చేరుకుంది. ఈ సందర్భంగా కార్తిక్ తన యాత్ర లక్ష్యాన్ని వివరించారు.

  చిన్న వయసులోనే భూమిని కాపాడటం మొక్కలు నాటి  కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశం తో సైకిల్ పై భారత దేశ యాత్ర చేపట్టానన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కార్తీక్ ను అభినందించారు. 

నేటి యువకులు చదువులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో పాటు పర్యావరణ సమతుల్యత ఎలా చేయాలి అనేది కూడా గ్రహించాలని, అందుకు కోటా కార్తిక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు ఈయన యాత్ర దిగ్విజయంగా జరగాలని ప్రతి గ్రామం పట్టణం నగరాల్లో ఈ యువకుడికి సంఘీభావం తెలియజేయాలని  కోరారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu