థాయిలాండ్-కాంబోడియా మధ్య సీజ్ ఫైర్
posted on Jul 28, 2025 4:47PM

థాయిలాండ్ - కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే సీజ్ఫైర్ అమలు చేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. కాగా జూలై 24 నుంచి థాయిలాండ్-కాంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
నాలుగురోజుల థాయ్-కంబోడియా సరిహద్దు ఘర్షణలతో 34 మంది మరణించగా, లక్షా 68వేల మంది నిర్వాసితులు అయ్యారు. యుద్ధం ఆపేందుకు థాయ్-కంబోడియా నేతలతో తాను మాట్లాడానని, వారు చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ప్రకటించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు థాయ్ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్ వేచాయచాయ్ ఇవాళ చర్చలు సఫలం అయ్యాయి.