ఉగ్రవాదుల టార్గెట్ లిస్ట్ లో ఏపీ, తెలంగాణ

 

శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల నెక్స్ట్ టార్గెట్ భారత్ అని తెలుస్తోంది. శ్రీలంక వరస పేలుళ్ల ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు అలాంటి దాడులే భారత్ లో ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అది కూడా దక్షిణాది రాష్ట్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో.. ఇంటిలిజెన్స్ వర్గాలు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశాయి.
ఉగ్రవాదులు.. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. శక్తివంతమైన పేలడు పదార్థాలతో దాడులకు ప్లాన్ చేశారని అధికారులు తెలిపారు. దాడుల పంథాను ఉగ్రవాదులు మార్చుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ సారి రైళ్లు, రైల్వే స్టేషన్లను ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందరూ అప్రమత్తంగా ఉండలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.