ఉగ్రవాదుల చెరలో 20మంది భారతీయులు

 

 

 పశ్చిమ ఆఫ్రికాలోని మాలీ దేశ రాజధాని బమాకో నగరంలో రెడిసన్ బ్లూ హోటల్లో శుక్రవారం ఉద్రయం ఉగ్రవాదులు ప్రవేశించి సుమారు 170 మందిని బందీలుగా పట్టుకొన్నారు. వారిలో ఖురాన్ చదువగలిగిన 7మందిని విడిచిపెట్టారు. కొంతమంది బందీలను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన వారిలో 20మంది భారతీయులు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది ఆ హోటల్లో ఒక దుబాయ్ సంస్థ తరపున పనిచేస్తుండగా మరికొందరు, ఏదో పని మీద బకామోకి వెళ్లి ఆ హోటల్లో దిగి ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారని సమాచారం. 20 మంది భారతీయులు ఉగ్రవాదుల చేతికి చిక్కినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు దృవీకరించారు. మాలీ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తూ భారతీయుల క్షేమ సమాచారాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన భారతీయులు అందరూ క్షేమంగా ఉన్నట్లే చెపుతున్నారు. హోటల్ ని చుట్టుముట్టిన భద్రతాదళాలు లోపలకి ప్రవేశించి బందీలను విడిపించేందుకు చాలా ప్రయత్నిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu