తండ్రి కేసీఆర్ ను మించిపోయిన కూతురు కవిత.. చిక్కుల్లో పడుతుందా?
posted on Nov 20, 2015 5:27PM

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను చూస్తుంటే తన తండ్రినే మించిపోయినట్టు కనిపిస్తోంది. ఏ విషయంలో అనుకుంటున్నారా.. ఎన్నికల ఖర్చు విషయంలో.. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్ధి పరిమితికి మించి ఖర్చు పెట్టకూడదనే నిబంధన ఉంటుంది. అంతేకాదు వారి ఖర్చుల విషయంలో షాడో అబ్జర్వర్లు కూడా ఉంటారు. వారు అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి ఒక్క పైసా లెక్క రాసుకొని వాటిని ఎన్నికల కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. చివరికి షాడో అబ్జర్వర్లు ఇచ్చిన లెక్కకు, అభ్యర్థుల లెక్కకు సరిపోవాలి. ఇప్పుడు ఈ విషయంలో కవితకు కొత్త చిక్కులు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు విషయంలో ఆమె ఇచ్చిన లెక్కలో తేడా కనిపిస్తుంది. అయితే తండ్రి కేసీఆర్ చూపించిన లెక్కల్లో 30 లక్షలు తేడా రాగా.. కవిత చూపించిన లెక్కల్లో 32 లక్షలు తేడా వచ్చింది. అయితే కేసీఆర్ పార్టీ ఇచ్చిన సొమ్ములను ఈసీకి సమర్పించలేదు. కానీ కవిత మాత్రం ఈసీ తనకు ఇచ్చిన నిధులకి యథాతథంగా లెక్కలు చూపించింది. అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. తప్పుడు లెక్కలు చూపించడం చాలా నేరం. మరి కవిత లెక్కపై ఈసీ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.