చంపడం.. చావడంలో మజా ఉంది..
posted on Aug 6, 2015 11:23AM

పాకిస్తాన్ ఉగ్రవాది ఉస్మాన్ దీ కాశ్మీర్‌లో బిఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి నిన్న పోలీసులు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉస్మాన్‌దీ ని చూస్తుంటే గతంలో పట్టుబడ్డ కసబ్ కు మరో రూపంలో ఉండటం ఆశ్చర్యం. కసబ్ పట్టుబడినప్పుడు కూడా అతడి కళ్లలో భయం కాని.. బాధ కాని కనిపించలేదు సరికదా.. పైగా వెకిలి నవ్వులు చేష్టలు చేసేవాడు. సాధారణంగా ఇలాంటి ఉగ్రవాదులను వాళ్లను ట్రైనింగ్ చేసేప్పుడే చాలా కఠినంగా చేస్తారు. అందుకే వాళ్లుకు భయం కాని ప్రాణాల మీద ఆశ కాని ఉండవు. ఇప్పుడు ఉస్మాన్‌దీ కూడా అంతే ఎలాంటి భయం లేకుండా కెమెరా ముందు కూర్చుని పోలీసులు వారు అడిగే ప్రశ్నలకు చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పైగా అతని మాటలు తనలోకి పైశాచికానికి నిదర్శనంగా నిలిచాయి. తాను చెప్పిన వివరాలు.. తాను నెలరోజుల కిందటే భారత్ లోకి రావడానికి ప్రయత్నించి తమకు దారి చూపించాల్సిన వ్యక్తి రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. అయితే మళ్లీ తాను తన సహచరుడు మొమిన్ ఖాన్ తో కలిసి 12 రోజుల కింద్రటే కాశ్మీర్ లోకి అడుగుపెట్టామని.. ఇక్కడి హిందువులను చంపడానికి వచ్చామని చెప్పాడు. అయితే ఈ పదిరోజులు అడవుల్లో తిరిగి నిన్నబీఎస్‌ఎఫ్ జవాన్లపై దాడి చేశామని చెప్పాడు. అయితే ఈ కాల్పుల్లో తనతో వచ్చిన మొమిక్ ఖాన్ చనిపోయాడని నేను పట్టుబడ్డానని ఎంచక్కా నవ్వుకుంటూ సమాధానం చెపుతున్నాడు. తాను కూడా మొమిక్ లాగా చనిపోయినా బాధ పడేవాడికి కాదని.. అదంతా అల్లా కార్యం అని అనుకునేవాడినని.. అయినా చంపడం.. చావడంలో మజా ఉంటుందని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. మరీ కసబ్ ను పట్టుకుని అతనిని శిక్షించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. దానికి తోడు కోట్లకు కోట్లు ఖర్చు. ఇప్పుడు ప్రాణాలతో పట్టుబడ్డ ఈ ఉన్నాదిని శిక్షించేసరికి ఎన్నిసంవత్సరాలు పడుతుందో ఎంత ఖర్చవుతుందో మన ప్రభుత్వానికి.