పులివెందులలో ఘర్షణ వాతావరణం.. అంతటా టెన్షన్ టెన్షన్
posted on Aug 12, 2025 10:36AM

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది. మంగళవారం (ఆగస్టు 12) ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏరపాటు చేశారు.
పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులున్నారు. అయితే పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.
ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఎర్రిపల్లిలో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. కాగా పోలింగ్ ప్రారంభానికి కొద్ది సేపు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడప తరలించారు. అలాగే తెలుగుదేశం, వైసీపీలకు చెందిన కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. మొత్తం మీద పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందా అన్నట్లుగా టెన్షన్ వాతావరణం ఉంది.