నిప్పుల కుంపటి తెలంగాణ!

వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర  ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.  మొత్తంమీద ఈ నాలుగు రోజులూ రాష్ట్రంలో సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.

మండే ఎండలకు తోడు వేడి గాలులు కూడా వీస్తాయనీ, వడదెబ్బ ప్రమాదం హెచ్చుగా ఉంటుందనీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే మేలని పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయనీ, ఉక్కపోత తీవ్రత ఎక్కువ అవుతుందని తెలిపింది.  

ఇక వచ్చే నెలలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకూ నమోదౌతున్నాయనీ, రానున్న రోజులలో ఇవి 50 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయనీ పేర్కొంది.