కేటీఆర్ విశ్వాసం లేని డాష్.. డాష్..!

శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే చాలావరకు ఖాళీ అయిపోగా, అక్కడక్కడ మిగిలి వున్న పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్లర్లో కొన్ని లైన్లు పోస్టు చేశారు. తమ పార్టీ పుట్టుక సంచలనం అని, దారిపొడవునా రాజీలేని రణం.. అని ఏవేవో సోత్కర్ష లాంటి పదాలు పోస్టు చేశారు. ఇండియాలో ఎవరూ ఇంకొకరి డబ్బా కొట్టరు.. ఎవరి డబ్బా వాళ్ళే కొట్టుకోవాలి కాబట్టి కేటీఆర్ ట్విట్టర్లో సొంతడబ్బా కొట్టుకున్నారని అనుకోవచ్చు. కానీ ఆయన అందులో వాడిన ఒక వాక్యం చూస్తుంటే, కేటీఆర్ని విశ్వాసం లేని డాష్.. డాష్ అన్నా తప్పులేదని అనిపిస్తోంది. ఇంతకీ ఆ పదం ఏమిటంటే, ‘పరపీడన చెర విడిపించిన ఉద్యమ జెండా’.. ఈ పదం రాయడానికి సిగ్గు లేకుండా అయినా వుండాలి.. లేదా బుద్ధి అయినా లేకుండా వుండాలి. కేటీఆర్ తండ్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు తెలుగువాళ్ళందరి మీద అధికారం చెలాయించాడా లేక తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించాడా? తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగతా మంత్రులుగానీ, ముఖ్యమంత్రులుగానీ తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించారా? బ్రిటీష్ వాళ్ళ మీద ఉపయోగించిన ‘పరాయి పాలన’ అనే పదాన్ని తోటి భారతీయుల మీద ఉపయోగించడమంత దుర్మార్గం మరొకటి వుండదు. అలాంటి దుర్మార్గాలు ఎన్నో చేసిన పాపం మూటగట్టుకుంది కేసీఆర్ ఫ్యామిలీ. 

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకునిపోయింది. ఆ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క స్థానం తప్ప అన్ని స్థానాలు దక్కాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రావాళ్ళు ఓట్లు వేయబట్టే బీఆర్ఎస్ పరువు హైదరాబాద్‌లో అయినా మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వున్న తెలంగాణ స్థానికులు అందరూ బీఆర్ఎస్‌ని బొందపెడితే, హైదరాబాద్‌లో తమ పార్టీ పరువు నిలిపింది ఆంధ్రావాళ్ళేననే విశ్వాసం కూడా లేని డాష్ డాష్ కేటీఆర్‌కి పార్లమెంట్ ఎన్నికలలో ‘పరాయి’ వాళ్ళు బుద్ధి చెబుతారు.