24 గంటల ఆన్‌లైన్ రేడియో టోరి ఒక్కటే: తెలుగువన్ ఎండీ రవిశంకర్

 

 

 

 

 

ప్రపంచంలో 24 గంటలు పనిచేసే ఏకైక ఆన్‌లైన్‌ రేడియో టోరి రేడియో ఒక్కటే అన్నారు తెలుగువన్.కామ్ ఎండీ కంఠంనేని రవిశంకర్. తెలుగువన్ 16వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదహరేళ్ల క్రితం తెలుగువన్.కామ్ పెడుతున్నట్లు తాను కొందరు సన్నిహితుల ప్రస్తావిస్తే తనను అందరూ వారించారని, కాని నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో తెలుగువన్ సంచలనం సృష్టించిందన్నారు.

యూ ట్యూబ్ రాకముందే ఆన్‌లైన్‌లో సినిమాను ప్రదర్శించిన చరిత్ర తెలుగువన్‌ది అన్నారు. ఇప్పుడు యూట్యూబ్ తాను ఆనాడు చేసిన ప్రయోగాన్ని ఆచరించి విజయవంతంగా దూసుకెళ్తుందన్నారు. టాలెంట్ ఉండి అవకాశాలు రాక నిరాశలో ఉన్న యువతకు షార్ట్‌ ఫిల్మ్ చేసే అవకాశాన్ని కల్పించి వారి ప్రతిభకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత తెలుగువన్‌దే అన్నారు. టోరి రేడియో ద్వారా 44 దేశాల్లోని తెలుగువారిని ప్రతిరోజు పలకరిస్తున్నామన్నారు. బీబీసీ రేడియో కూడా 22 గంటలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే..తాము 24 గంటలు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నామన్నారు.