తెలంగాణ తెలుగు యూనివర్శిటీ పేరు మార్పు..
posted on Dec 2, 2015 2:04PM

రాష్ట్రం విడిపోయిన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏపీకి సంబంధించిన పేర్లన్నింటినీ మార్చేసింది. ఇప్పుడు తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయా విశ్వవిద్యాలయానికి ఫ్రోపెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా మార్చగా.. ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు మార్చి దానికి సామాజిక చరిత్రకారుడైన సురవరం ప్రతారపెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతుందని.. ఈవిషయంపై ఏదో ఒక నిర్ణయం త్వరలో తీసుకుంటామని టీ సర్కార్ వెల్లడించింది. అంతేకాదు ఈ యూనివర్శిటీ పేరు మార్పుపై కేసీఆర్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.