పేదల కోసం శ్రమిస్తున్న లీడర్
posted on May 16, 2015 2:32PM

ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే రాజకీయ నాయకులకు ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు కళ్ళకు కనపడతాయి సందులు గొందులు తిరుగుతారు వరినాట్లువేస్తారు, వరికోతలు కొస్తారు, ఇస్త్రీ చేస్తారు పేపరు ఫోటోలకు పోజులిస్తారు. రాజకీయ నాయకులు అది చేస్తాం, ఇదిచేస్తాం అని మాటల గారడితో పిచ్చిగా నమ్మే ప్రజలకు హామీలతో వరాల జల్లులు కురిపిస్తారు వారి మాటలు నమ్మి వారికి ఓట్లేసిన ఓటర్లు ఎలక్షన్ కాగానే ఎలక్షన్ ముందు ఉన్న సమస్యలు పరిష్కారం కాక ప్రజలు బాధలతో కన్నీళ్ళతో తడసి ముద్దవుతున్నారు. ప్రజల సమస్యలు నాయకులకు అర్జీల రూపంలో ఇచ్చినా బడ్జెట్ లేదని అటకెక్కుతాయి గతంలో ప్రజలకు వారిచ్చిన హామీలు నెరవేర్చటానికి సొంత డబ్బులు కర్చుచేసి ప్రజల బాధలు తీర్చే నాయకులు ఉన్నారా ?.
ఇదే మనభారత దేశ రాజకీయం, రాజకీయనాయకులు. (ప్రజల సమస్యలు తీర్చలేని రాజకీయనాయకులకు మాత్రమే)
పై కోవకు చెందని నాయకులు కొందరుంటారు వారిలో ఒక్కడు మన కంఠంనేని రవిశంకర్ ప్రజల నుంచి ఏమీ ఆశించకుండా, రాజకీయ పదవి లేకపోయిన, తాత ముత్తాతలు సంపాదించినా ఆస్తులు లేకపోయినా తాను సంపాదించుకున్న దానిలో పేద ప్రజల కోసం ఖర్చు చేసి పేద ప్రజలిచ్చేఆశీస్సులు తాను ఎన్ని కోట్లిచ్చినా దొరకవని మానవ సేవయే మాధవ సేవ అని ముందుకు సాగుతూ "తెలుగు వన్" ఫౌండేషన్ స్థాపించి అనేకమంది పేద ప్రజలను ఆదుకుంటున్న (ఆపదలో ఉన్నవారికి వైద్యం, పేద పిల్లలకు స్కాలర్ షిప్ ద్వారా విధ్య , నిరు పేదలకు గృహనిర్మాణం, ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, గ్రామీణ మహిళలకు ఉపాధి, ఉచిత కంఫ్యూటర్ విధ్య, వరదబాధితులకు సహాయం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, యువతకు క్రికెట్ కోచింగులు, అగ్ని ప్రమాద బాధితులకు అర్దిక సహాయం, చేనేత కార్మికులకు బియ్యం పంపిణి, దేవాలయాల పునర్నిర్మాణాలకు ఆర్ధిక సహాయం ) ఇలా అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రాంతం, కులం, మతం, ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా పేద ప్రజలకు సహాయం చేయాలి.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనే సంకల్పంతో నిరుపేదల బ్రతుకులలో వెలుగులు నింపటానికి నిస్వార్ధసేవనే నిరుపమానంగా అందించటానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నిజమైన లీడర్ కంఠంనేని రవిశంకర్ గారు రాజకీయల్లోకి రావాలని ప్రజలకు మరింత సేవలు చేయాలని కోరుకుందాం.