విజయ్‌సాయి చివరి కోరిక ఏంటో తెలుసా..?

 

సినిమాల్లో అవకాశాలే లేకో..? భార్య ప్రవర్తన నచ్చకో.. మరేదైనా చెప్పుకోలేని బాధో తెలియదు కానీ కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణం టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. నలుగురు తలోక మాట చెబుతున్నప్పటికీ బలన్మరణానికి కారణాన్ని మాత్రం స్పష్టంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ సంగతి పక్కనబెడితే ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్న విజయ్‌కి ఒక చివరి కోరిక ఉందట. అదేంటో తెలుసా..? భార్యతో కలిసి రెండ్రోజులు సంతోషంగా గడపాలన్నది అతని అఖరి కోరికట. ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందు సాయి తన భార్య వనితతో ఓ ఫోన్ కాల్ మాట్లాడాడు.. ఒక్క పదిహేను నిమిషాలు కలిసి మాట్లాడుకుందామని ఆమెను కోరాడు. "నువ్వు ఆనందంగా ఉండాలని.. టెన్షన్‌తో జీవించవద్దని.. ఇక నీ జీవితంలోకి తాను అడ్డురానని.. ఒక్క రెండ్రోజులు నీతో సంతోషంగా గడపాలని ఉందని అడిగాడట". కానీ ఆ కోరిక తీరకుండానే.. ఇంతలోనే ఇలా జరగడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ కాల్‌డేటా పరిశీలనలో పోలీసులకు ఈ విషయం తెలిసింది. తన చావుకి భార్య వనితనే కారణమంటూ సెల్ఫీ వీడియోలో చెప్పిన విజయ్‌.. భార్యతో రెండ్రోజులు గడపాలనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu