తెలంగాణలో వాతావరణం కూల్ కూల్!

తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచీ ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో తెలంగాణ ఎండ వేడిమి నుంచి సేద తీరింది. హైదారబాద్,  హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో  ఓ మోస్తరు వర్షం కురిసింది.

మరి కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.   నిజామాబాద్‌ జిల్లాలో వర్షం కారణంగా భారీగా పంటనష్టం జరిగింది. సిద్దిపేట, దుబ్బాకలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది.