చికాగోలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థిని మృతి
posted on Aug 12, 2025 4:12PM

చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థిని మరణించింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీనురావు పెద్ద కుమార్తె 23 ఏళ్ల శ్రీజ వర్మ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళింది. చికాగోలో ఉంటూ పీజీ చేస్తున్నది.
సోమవారం (ఆగస్టు 11) రాత్రి సమయంలో డిన్నర్ చేయడం కోసం అపార్ట్ మెంట్ పక్కన ఉన్న రెస్టారెంట్ కు నడుచుకుంటూ వెడుతున్న శ్రీజవర్మను వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీజ అక్కడికక్కడే మరణించింది. అయితే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ట్రక్ ను ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకుని సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె మరణవార్తతో శ్రీజ తల్లిదండ్రులు దుఖసాగరంలో మునిగిపోయారు.