రూ.50 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
posted on Sep 15, 2025 8:04PM
.webp)
తెలంగాణ పోలీసులు, ఈగల్ టీం, ఎక్సైజ్, కస్టమ్స్, అధికారులు ఇలా వివిధ శాఖలకు చెందిన అధికారులందరూ కలిసి డ్రగ్స్ అనే మహమ్మారిని తెలంగాణ నుండి తరిమి వేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తు న్నారు .కానీ స్మగ్లర్లు మాత్రం పోలీసులు, అధికారుల చేతికి మేము చిక్కం అనే టైపులో డ్రగ్స్ సరఫరా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరకు అధి కారుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి వెళ్తున్నారు. బ్యాంకాక్ నుండి ముంబై చేరుకున్న స్మగ్లర్లు కబుర్లు చెప్పుకుంటూ ముంబై అంతర్జా తీయ దాటి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.
కానీ కస్టమ్స్ అధికారు లకు అనుమానం వచ్చి వారి లగేజ్ బ్యాగులను పరిశీ లించగా అసలు విషయం బయట పడింది. ఈ స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగ కుండా విదేశీ గంజా యిని లగేజీ బ్యాగ్ అడుగు భాగంలో దాచిపెట్టి దానిపైన దుస్తులు పెట్టుకొని దర్జాగా విమానం దిగి ఎయిర్పోర్ట్ నుండి బయటకు వెళ్లేందుకు ప్రయ త్నం చేశారు. కస్టమ్స్ అధికారులు వెంటనే అప్రమత్తమై ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 49.196 కోట్ల విలువ చేసే 49 కేజీల విదేశీ గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద వీరందరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.