కల్వకుంట్ల కవిత అరెస్టు!

బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా మౌనంగా ఉంటున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి జెండాతో దూకుడుగా సాగుతున్నారు. తాజాగా బస్ పాస్ చార్జీలను పెంచు తూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత ఆందోళనకు దిగారు. బస్ చార్జీల పెంపునకు నిరసనగా ఆమె మంగళవారం (జూన్ 10) బస్ భవన్ బంద్ నకు పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జెండాలు లేకుండా ఆమె జనజాగృతి కార్యకర్తలతో  బస్ భవన్ ముట్టడికి బయలు దేరారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో  పోలీసులు కవితను అదుపులోనికి తీసుకున్నారు. ఆమెతో పాటు ఆందోళనలో పాల్గొన్న జనజాగృతి కార్యకర్తలను కూడా అదుపులోనికి తీసుకున్నారు.  

పెంచిన బస్ చార్జీలను తగ్గించే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని కవిత ఈ సందర్భంగా చెప్పారు. అంతకు ముందు కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బస్ చార్జీల పెంపును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సంస్కృతి, భాష, యాస కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి పోన్ లో మాట్లాడేటప్పుడు హలో అనడానికి బదులుగా జై తెలంగాణ అనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనడానికి మనసురావడం లేద న్నారు.బోనాల సందర్భంగా ప్రతి బోనం పైనా జై తెలంగాణ నినాదం రాయాలని పిలుపునిచ్చారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu