తిరుమలలో అగ్నిప్రమాదం

తిరుమలలో అగ్రిప్రమాదం సంభవించింది. అయితే అటవీ ప్రాంతంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.   శిలాతోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. భక్తుల సమాచారంతో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.  

అగ్నిప్రమాాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. అటవీ ప్రాంతంలో స్వల్పంగా మంటలు చెలరేగాయనీ, వెంటనే అదుపు చేశామని అగ్నిమాపక సిబ్బంది తెలిసారు. టీటీడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగలేదని తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu