గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
posted on Jun 11, 2025 11:11AM
.webp)
మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పది లక్షల రూపాయల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలనీ, పాస్ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశిస్తూ గాలి జనార్దన్ రెడ్డికి కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె.మెఫజ్ అలీఖాన్, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ లకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గాలి ముందస్తు బెయిలు పిటిషన్ పై మంగళవారం (జూన్ 10)న వాదనలు పూర్తికాగా హైకోర్టు బుధవారం (జూన్ 11) గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.