ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు జర్నలిస్టు కృష్ణంరాజు

ముందు వెనుకలాలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి.. ఇప్పుడు అరెస్టు భయంతో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు జర్నలిస్టు కృష్ణంరాజు. రాజధాని అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు.. నిరసనలు వెల్లువెత్తి, కేసు నమోదు కాగానే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.

పోలీసులు తన కోసం తీవ్రంగా గాలిస్తుండటం, జాతీయ మహిళా కమిషన్ కూడా తనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, ఆ చర్యల నివేదికను మూడు రోజులలో సమర్పించాలంటూ ఏపీ డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో అరెస్టు తప్పదన్న భయంతో కృష్ణం రాజు ముందస్తు బెయిలు కోసం మంగళవారం (జూన్ 10) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  పూచీకత్తులు సమర్పిస్తానని, తనకు విజయవాడ, అమరావతి చుట్టుపక్కల ఆస్తులు ఉన్నందున పారిపోనని తన ముందస్తు బెయిలు పిటిషన్ లో కృష్ణంరాజు పేర్కొన్నారు.  కాగా కృష్ణంరాజు ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం (జూన్ 12) విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu