పాపను బయటకు తీసేందుకు చివరి ప్రయత్నం

రంగారెడ్డి జిల్లా ఇక్కా గూడెంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తోంది. బావిలో పడి 48 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పాప ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం 180 అడుగుల వద్ద చిన్నారి ఉందని భావిస్తున్నారు. బావిలో నీటిని తోడేందుకు సూపర్‌జెట్ మోటార్‌ను రంగంలోకి దించారు. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని కోరుతూ గోరేపల్లిలో స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇంతటి ఘోర ప్రమాదానికి పరోక్ష కారణమైన బోరు బావి యజమాని మల్లారెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu