తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 92.34 హాజరు

తెలంగాణలో ఇవాళ జరిగిన ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,43,524 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా..అందులో 11,068 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హజరయ్యారు. మొత్తం 92.34 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ చరిత్రలోనే తొలిసారిగా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu