హస్తినలో రేవంత్ సింహగర్జన.. సౌత్ నుంచి ఏకైక నాయకుడు!

ఎటు నుంచి ఎటు చూసినా కాంగ్రెస్ కి హైప‌ర్ యాక్టివ్ గా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే క‌నిపిస్తున్న‌ట్టుంది చూస్తుంటే. ఇక్క‌డి బీసీ రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారం ఢిల్లీ వ‌ర‌కూ తీసుకెళ్లి.. అక్క‌డ స‌భ‌లు- స‌మావేశాలు- ధ‌ర్నాలు- వ‌గైరా ఏర్పాటు చేసి.. దీన్ని అమ‌లు చేయ‌కుంటే మోడీ ముక్కు నేల‌కేసి రాసి.. గ‌ద్దె దింపుతాం అంటూ హెచ్చరిస్తున్నారు రేవంత్.  ఒక్క‌మాట‌లో చెప్పాల్సి వ‌స్తే రేవంత్ కాంగ్రెస్ కాంగ్రెస్ సింహంలా గర్జిస్తున్నారు. జాతీయ స్థాయిలో  కాంగ్రెస్ ప‌రంగా చూస్తే రాహుల్ త‌ర్వాత ఆ స్థాయిలో ఐకానిక్ లీడ‌ర్షిప్ క‌నిపిస్తోంది ఒక్క రేవంత్ రెడ్డిలోనే అని పరిశీలకులు అంటున్నారు.  

రేవంత్ రాజకీయ జీవితం ప్రారంభమైనది ఏబీవీపీలో.. రాజ‌కీయ పుట్టుక తీస ఏబీవీపీలో, అటు పిమ్మ‌ట కేసీఆర్ కి శిష్యుడిగానూ త‌యార‌వ్వాల‌ని చూసి..  ఆపై టీడీపీలోకి వ‌చ్చి.. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశంలో ఉండటం వల్ల  ఉండ‌టం వ‌ల్ల యూజ్ లేద‌ని గుర్తించి.. కాంగ్రెస్ లో చేరారు. చేరడంతోనే  టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టారు. ఇదేమంత మామూలు విషయం కాదు. దీంతో  రేవంత్ రెడ్డి   కాంగ్రెస్ లీడ‌ర్ల‌లోనే హైప‌ర్ యాక్టివ్ గా క‌నిపిస్తున్నారు. ఢిల్లీ గ‌డ్డ మీద మోడీగా తొడగగొట్టి సవాల్ విసురుతున్నారు.  

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సరిగ్గా ఇలానే ఉండేవారు.  ఇక్క‌డి నుంచి అధిక మొత్తంలో ఎంపీ సీట్లు గెలిచి.. ఢిల్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చేలా చేశార‌న్న పేరు సంపాదించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అలా గే క‌నిపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించే తెలంగాణ‌లో ఆ స్థాయిలో ఎంపీ సీట్ల సాధ‌న‌కు స్కోప్ పెద్దగా కనిపించడం లేదు కానీ.. ఆ దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.  

ప్ర‌స్తుతం కాంగ్రెస్ కి కూడా ఏమంత గొప్ప నాయ‌క‌త్వ ప‌టిమ లేదు. ఇంటా బ‌య‌టా రాహుల్ ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. ఇందిర‌ను పోలి ఉన్న ప్రియాంక కూడా ఏమంత గొప్ప వాయిస్ వినిపించ‌లేక పోతున్నారు. ఆమె స్టామినా అంతంత మాత్రంగానే క‌నిపిస్తోంది. ఇక కాంగ్రెస్ లోని కొంద‌రు సీనియ‌ర్ ఎంపీలైతే.. పార్టీ వ్య‌తిరేక వాయిస్  వినిపిస్తున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలో మోడీని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి రివ‌ర్స్ లో కాంగ్రెస్ కే కౌంట‌ర్లు వేశారు. అయితే రేవంత్ ఒక్కరే కాంగ్రెస్ లో గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు.  రాహుల్ ఆయ‌న్ను ఒక్కో సారి దూరం పెడుతున్నా.. వెన‌కాడ‌క రాహుల్ తోటిదే ప్ర‌యాణం అంటూ భ‌రోసా అందిస్తున్నారు. దీంతో  ప్రస్తుతం  సౌత్ నుంచి రేవంత్ ఫ్లాగ్ షిప్ లీడ‌ర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ గా మారిన దృశ్యం ఆవిష్కృతమైతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu