శంషాబాద్ విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్టు

శంషాబాద్ విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పశ్చిమ బెంగాల్ నుంచి డ్రగ్స్ తీసుకుని వస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన కస్టమ్స్ పోలీసులు వారి వద్ద నుంచి 7 గ్రాముల బ్రౌన్ సుగర్ ను స్వాధీనం చేసుకున్నారు.

విచారణ తరువాత వారిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఆ నలుగురు సభ్యుల ముఠాను అదుపులోనికి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలను ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu