కేసీఆర్‌కు ఆంధ్రా అల్లుడు రాబోతున్నాడు...!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రా అబ్బాయి అల్లుడిగా రాబోతున్నాడు. అదేంటి కేసీఆర్‌ కూతురు కవితకు అల్రెడీ పెళ్లయిపోయింది కదా మళ్లీ అల్లుడేంటి అంటారా? అసలు మ్యాటరేంటంటే కొన్నాళ్ల క్రితం ప్రతీ రోజు తండ్రి, పినతల్లి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై..గృహ నిర్భంధంలో చిక్కుకుని ఆఖరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో..మహిళా సంఘాలు, ఎన్జీవోలు, మీడియా చొరవతో ఆ యువతిని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు రక్షించి..ఆ తర్వాత హాస్టల్‌లో జాయిన్ చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత ప్రత్యూష దీనగాథ గురించి తెలుసుకుని స్వయంగా ఆస్పత్రిలో ఆమెను పరామర్శించి దత్తత తీసుకోవడం అందరికీ తెలిసిందే.

 

ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ప్రత్యూష ప్రేమలో పడింది. తాను ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని ప్రేమించానని..అతడితో పెళ్లి జరిపించాలని అధికారులను కోరడం సంచలనం రేపింది. ఇంతకీ ప్రత్యూష లవ్ స్టోరీలోకి వెళితే..ఆమె ప్రేమించిన యువకుడి పేరు మద్దిలేటి వెంకట్ అని..కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఈ యువకుడు తన దగ్గరి బంధువులు హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న సమయంలో..వారి బాగోగులు చూసుకోవడం కోసం అక్కడే ఉండేవాడు. అదే సమయంలో..తన కంటి చికిత్స నిమిత్తం ప్రత్యూష అదే హస్పిటల్‌లో జాయిన్ అయ్యింది. ఈ క్రమంలోనే, ఇద్దరికీ మాటలు కలవడం..స్నేహానికి దారి తీయడం, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. ప్రత్యూష ఎల్వీ ప్రసాద్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఫోన్లలో మాట్లాడుకోవడం, వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకోవడం జరిగింది. వీరి స్నేహం..ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే, ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అధికారుల వద్ద ప్రత్యూష తన ప్రేమను చెప్పింది. అయితే ప్రత్యూషకు సంబంధించిన అన్ని విషయాలు ముఖ్యమంత్రి చూసుకుంటుండటంతో ఈ విషయాన్ని సీఎంవోకు చేరవేశారు. తదనంతరం సీఎంవో ఆదేశాలతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల సాయంతో వెంకట్ వివరాలు సేకరించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రత్యూషను దత్తత తీసుకోవడం వల్ల ఆయన ఆమెకు తండ్రి. ఈ పెళ్లికి సీఎం పచ్చజెండా ఊపితే తెలంగాణ సీఎంకి అల్లుడిగా ఆంధ్రా అబ్బాయి వెంకట్ వెళ్లే అవకాశాలున్నాయి. మరి సీఎం నిర్ణయం ఎలా ఉండబోతుందో.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu